Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
- అభ్యర్థులకు మెటీరియల్ పంపిణీ
నవతెలంగాణ-తొర్రూర్ రూరల్
నిరుద్యోగులు ఉచిత శిక్షణా శిబిరాలను వినియోగించుకుని ఉద్యోగాలు సాధించాలని రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరారు. ఎర్రబెల్లి ట్రస్ట్ అధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉపాధి, ఉద్యోగ శిక్షణ శిబిరంలో అభ్యర్థులకు మంగళవారం ఆయన మెటీరియల్ పంపిణీ చేసి మాట్లాడారు. నిరుద్యోగులకు ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహించడాన్ని బాధ్యతగా భావిస్తున్నట్టు తెలిపారు. శిక్షణ ద్వారా వేలాది మంది ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు పొందాలని ఆకాంక్షించారు. దూర ప్రాంతాలకు వెళ్లి శిక్షణ పొందలేని పేదలకు శిబిరం ఉపయోగపడుతుందని చెప్పారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. శిక్షణ ద్వారా ఇప్పటికే వెయ్యి మందికిపైగా వివిధ ఉద్యోగాలు పొందేలా తొర్రూర్‌లో రాయపర్తి, పెద్దవంగర మండలాలకు పాలకుర్తిలో, పాలకుర్తి కొడకండ్ల మండలాలకు అందుబాటులో ఉచిత శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని చెప్పారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఇక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఇప్పటికే లక్షా 30 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు తెలిపారు. తాజాగా 85 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు పడుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య, జెడ్పీ ఫ్లోర్‌లీడర్ మంగళపల్లి శ్రీనివాస్, మున్సిపల్ చైర్మెన్ మంగళపల్లి రామచంద్రయ్య, మండల అభివద్ధి కమిటీ చైర్మెన్ పొనుగోటి సోమేశ్వర్రావు, ఆర్డీఓ రమేష్, బిందు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.