Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆకుల రాజు
- యూనియన్ పట్టణ కమిటీ మహాసభ
నవతెలంగాణ-మహబూబాబాద్
ఐక్యపోరాటాలతోనే హక్కుల పరిరక్షణ సాధ్యమని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆకుల రాజు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఉద్యమాలతో తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని పెరుమాండ్ల జగన్నాధం భవన్లో వాసం దుర్గారావు, బతుత్ల వెంకన్న, గారె కోటేశ్వర్రావు అధ్యక్షవర్గంగా మంగళవారం నిర్వ్వమించిన యూనియన్ పట్టణ కమిటీ 7వ మహాసభకు ముందు సీనియర్ నాయకులు గుట్టయ్య సంఘం జెండాను ఆవిష్కరించగా తోట భిక్షంకు నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా ఆకుల రాజు ప్రారంభోపన్యాసం చేశారు. సుదీర్ఘ పోరాటాల ఫలితంగా సాధించుకున్న చట్టాలను కేంద్ర ప్రభుత్వం సవరణ పేరుతో నీరుగార్చుతోందని విమర్శించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఎనిమిదేండ్లు గడచినా షెడ్యూల్డ్ పరిశ్రమల్లో జీఓలను విడుదల చేయలేదని చెప్పారు. ఆ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కుంట ఉపేందర్ మాట్లాడుతూ జూలై 16, 17 తేదీల్లో జిల్లా కేంద్రంలో తలపెట్టిన జిల్లా తతీయ మహాసభల విజయవంతానికి కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. అనంతరం 25 మందితో పట్టణ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కన్వీనర్‌గా కుమ్మరికుంట్ల నాగన్న ఎన్నికయ్యారు. మహాసభలో నాయకులు తోట శ్రీనివాస్, సుధాకర్, చందు, జనార్ధన్, లచ్చు, కాంతి, శ్రీనివాస్, నాగయ్య, అల్వార్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.