Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అప్పగించాలని రైతుల ఆందోళన
నవతెలంగాణ-గార్ల
మండలంలోని పినిరెడ్డిగూడెంలో ఐదేండ్ల క్రితం నిర్మించిన ధాన్యం నిల్వ గిడ్డంగి నిర్వహణ బాధ్యతను గ్రామ పంచాయతీకి అప్పగించాలని రైతులు కేలోత్ బాల, భూక్య బిచ్చా అధికారులను కోరారు. ఈ మేరకు వారు గిడ్డంగి ఎదుట మంగళవారం ఆందోళన చేపట్టి మాట్లాడారు. అనేక ఏండ్లుగా గిడ్డంగి నిర్వహణ ప్రయివేట్ వ్యక్తుల చేతిలో ఉండటం వల్ల మిల్లర్లకు మాత్రమే లబ్ది కలుగుతోందని చెప్పారు. స్థానిక రైతులకు మొండి చెయ్యి చూపిస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. ఈ సమస్యను త్వరలో ఉన్నతాధికారుల దష్టికి తీసుకెళ్తామని రైతులు తెలిపారు. అందోళనలో రైతులు చందు, హరిసింగ్, కిషన్, సీతారాం, శివాజీ, నరేష్, సేన్యా, కిషన్, సీతారాం, వెంకన్న, వస్రామ్, బిచ్యా తదితరులు పాల్గొన్నారు.