Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ శశాంక
నవతెలంగాణ-మహబూబాబాద్
శుభ్రపర్చిన ధాన్యాన్ని మిల్లులకు పంపి చెల్లింపుల్లో రైతులకు కోత లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు. కురవి మండల కేంద్రంలో పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏబీ రైతు సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్‌తో కలిసి కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడారు. కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని ప్యాడీ క్లీనర్ సాయంతో శుభ్రం చేసి రోజు ఉదయం ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించి త్వరగా మిల్లులకు పంపడానికి ఇన్ఛార్జీలు చర్యలు తీసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ డీఎం మహేందర్, తహసీల్దార్ ఇమ్మాన్యూయేల్, ఎంపీడీఓ సరస్వతి, సొసైటీ చైర్మెన్ గోవర్ధన్‌రెడ్డి, ఏఓ మంజురాన్, తదితరులు పాల్గొన్నారు.
ఈవీఎం గోదాములో తనిఖీ
జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదామును అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్‌తో కలిసి జిల్లా కలెక్టర్ శశాంక తనిఖీ చేశారు. తొలుత స్ట్రాంగ్ రూమ్‌ను పరిశీలించారు. కలెక్టర్ వెంట ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ అనురాధ బాయి, డిప్యూటీ తహసీల్దార్ శ్యామ్, సిబ్బంది రంజిత్, తదితరులు పాల్గొన్నారు.
క్రీడా ప్రాంగణ ఏర్పాటు కొరకు స్థల పరిశీలన
క్రీడా ప్రాంగణ ఏర్పాటు కోసం అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్‌తో కలిసి కవిత కాలనీ సమీపంలోని 5 ఎకరాల స్థలాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించి మాట్లాడారు. కార్యక్రమంలో డీఆర్డీఓ సన్యాసయ్య, మున్సిపల్ డీఈ ఉపేందర్, ఏఈ సురేష్, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.