Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) బైక్ ర్యాలీ
నవతెలంగాణ-నెల్లికుదురు
పెంచిన నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో మండలంలోని వివిధ గ్రామాల్లో మంగళవారం బైక్‌ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల కార్యదర్శి పెరుమాండ్ల తిలక్ బాబు మాట్లాడారు. ఈనెల 27న మండల కేంద్రంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో తలపెట్టిన నిరసనను విజయవంతం చేయాలని కోరారు. అనంతరం మండలంలోని కాచికల్, ఎర్రబెల్లిగూడెం, మేచరాజు పల్లి గ్రామాల్లో ఉపాధి పనులను పరిశీలించారు. కూలీలకు వసతులు కల్పించాలని, రోజుకు రూ.600లు చొప్పున కూలీ చెల్లించాలని, ఏటా 200 పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు బాబుగౌడ్, ఇసంపెల్లి సైదులు, బానాల యాకయ్య, బొడ్డు బ్రహ్మయ్య, బత్తిని వెంకన్న, గణపురం కోతి ఎల్లయ్య, ఏర్పుల ఉప్పలయ్య, భూక్యా భిక్షపతి, మాలోత్ బోసు, గుగులోతు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.