Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు ధర్నా రైతు సంఘం
- రాష్ట్ర కమిటీ సభ్యుడు వెంకట్రెడ్డి
నవతెలంగాణ-ఏటూరునాగారం
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్క రించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 25న మండల కేంద్రాల్లో తలపెట్టిన నిరసనను విజయ వంతం చేయాలని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు తుమ్మల వెంకట్రెడ్డి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దావూద్ కోరారు. మండలంలోని ఆకులవారి ఘన్పూర్, బానాజీబంధం, ఎలిశెటి ్టపెల్లి గ్రామాల్లో రైతుసంఘం, గిరిజన సంఘం, సీఐటీయూ సంయుక్త ఆధ్వర్యంలో ప్రజ ాసమస్యలపై మంగళవారం సర్వే నిర్వహించారు. ప్రజలు పలు సమస్యలను వెలుగులోకి తీసు కొచ్చారు. అనంతరం వెంకట్రెడ్డి, దావూద్ మాట్లాడారు. ప్రధానంగా ఎలిశెట్టిపల్లెలో జంపన్నవాగుపై బ్రిడ్జి నిర్మించాల్సి ఉందన్నారు. గ్రామంలోని 150 ఎకరాల భూమికి సంబంధిత పట్టాలు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నా రని చెప్పారు. ఆకులవారి ఘన్పూర్లో 14 బోర్లు వేసినా విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల పంట పొలాలకు నీరందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అర్హులకు పింఛన్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, దళితబంధు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 25న తలపెట్టిన ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు పొలెం సత్యం, తాటి నర్సింహులు, చెరుకుల సుఖేందర్, పులిసె శేఖర్, చెరుకు నాణాద్రి, చింత సమ్మయ్య, వట్టం శివకుమార్, అట్టం వెంకట నర్సయ్య, అట్టం లచ్చిబాబు, పలక నర్సింహులు, ఉప్పలయ్య, తదితరులు పాల్లొన్నారు.