Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదనపు కలెక్టర్ డేవిడ్‌రాజ్
నవతెలంగాణ-నెల్లికుదురు
కాంటా వేసిన ధాన్యాన్ని త్వరగా మిల్లులకు తరలించాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ డేవిడ్‌రాజ్ నిర్వాహకులకు చెప్పారు. మండల కేంద్రంలోని, మునిగలవీడు, శ్రీరామగిరి, ఆలేరు గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్ యోగేశ్వర్రావుతో కలిసి అదనపు కలెక్టర్ మంగళవారం సందర్శించి మాట్లాడారు. వారం రోజుల్లో కొనుగోళ్లు పూర్తి చేయాలని చెప్పారు. వారం రోజుల్లో కొనుగోలు కేంద్రాల్లోని మొత్తం ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని ఆదేశించారు. రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కాంటా వేసి మిల్లులకు లారీలో తరలించాలని నిర్వాహకులకు స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీఎస్ఓ నర్సింహారావు, ఆయా కేంద్రాల నిర్వాహకులు ఉన్నారు.