Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య
- పరీక్షా కేంద్రంలో పరిశీలన
నవతెలంగాణ-తాడ్వాయి
పదో తరగతి వార్షిక పరీక్షలను సమర్ధవంతంగా నిర్వహించాలని అధికారులను జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆదేశించారు. మండలంలోని ఇంద్రనగర్ పాఠశాలలోని పరీక్ష కేంద్రాన్ని తహసీల్దార్ ముల్కనూర్ శ్రీనివాస్‌తో కలెక్టర్ కృష్ణ ఆదిత్య మంగళవారం సందర్శించి పరిశీలించారు. విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని, పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ఫోన్లను అనుమతించొద్దని, కోవిడ్ నిబందనలను పాటించాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, తాగునీటిని అందుబాటులో ఉంచాలని, హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయాలని, సకాలంలో పశ్నాపత్రాలను అందించాలని అధికారులకు చెప్పారు. విద్యార్థులు పరీక్షా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట వీఆర్వో తాడెం వీరస్వామి, వీఆర్ఏ ప్రవీణ్ తదితరులున్నారు.
నార్లాపూర్ కేంద్రంలో.. నార్లాపూర్లోని టెన్త్ పరీక్షా కేంద్రాన్ని ఎంఈఓ యాప సాంబయ్య, అటాచ్డ్ ఎస్సై శ్రావణ్‌కుమార్ సందర్శించి పరిశీలించారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.