Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
ప్రజల కోసం కళ అనే ఆశయంతో బొంబాయిలో 1943 మే 25న ఇప్టా(ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్) స్థాపించారని, నేడు కళాకారులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించడం దురదృష్టకరమని కళా వాచస్పతి అవార్డు గ్రహీత దామెర కృష్ణ అన్నారు. బుధవారం ఐపీటీఏ 79వ వార్షికోత్సవం సందర్భంగా శివనగర్ తమ్మెర భవన్ లో ఐపీటీఏ జెండా ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. ఆంధ్రాలో ఇప్టాకు అను బంధంగా ప్రజానాట్య మండలి ఏర్పడిందని గుర్తు చేశారు. ప్రజల సమస్యలను కళారూపాలుగా రూపొందించి ప్రజల్లో చైతన్యం కలిగించడం, జానపద కళలు తీర్చిదిద్దడం ధ్యేయంగా ప్రజానాట్యమండలి ముందుకు వెళ్తుందన్నారు. నాడు హిట్లర్ ఫాసిజాన్ని నిరసిస్తూ పాటలు, నాటికలు, యక్షగానాల ద్వారా ప్రజల్ని చైతన్యవంతం చేసింది ప్రజానాట్యమండలన గుర్తు చేశారు. మన సంస్కతి సాంప్రదాయాలను కాపాడుకోవాలని ప్రాచీన పౌరాణిక జానపద సంపదను పరిరక్షించేందుకు రాష్ట్ర వాప్తంగా తెలంగాణ ప్రజానాట్యమండలి ప్రత్యేక శైలిలో కృషి చేస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రామంలో గన్నారం రమేష్, రాంపెల్లి నరేష్, సువర్ణ, సుప్రియ, కాల్యాణి తదితరులు పాల్గొన్నారు.