Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీడీఓ శంకర్‌నాయక్
నవతెలంగాణ-మహాదేవపూర్
వేగవంతంగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలిన ఎంపీడీఓ శంకర్‌నాయక్ అన్నారు. బుధవారం మండల ప్రజా పరిషత్ కార్యా లయంలో గ్రామపంచాయతీ కార్యదర్శులకు ఎంపీపీ రాణిభారు అధ్యక్షతన వారంతపు సమీక్ష నిర్వహంచారు. ఎంపీడీఓ శంకర్‌నాయక్ పాల్గొని మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతీలో 300 మందికి పైగా కూలీలు ఉపాధిహామి పనులకు వచ్చేలా మేట్లు, పంచాయతీ కార్యదర్శులు అవగాహన కల్పించాలన్నారు. రోజుకు రూ.257 కూలీ గిట్టు బాటు అయ్యేలా పని ప్రదేశంలో కొలతలు పెట్టాలన్నారు. మహదేవపూర్ కాళేశ్వరం గ్రామ పంచాయతీల్లో ప్రతి రోజు సుమారు 500మంది కూలీలు పనికొచ్చేలా చర్యలు తీసుకొవాలని ఆదేశించారు. నర్సరీల్లో న మొక్కలు 100 శాతం సంరక్షించా లన్నారు. జూన్‌లో హరితహారం కోసం సర్పంచ్‌లతో చర్చించి మొక్కలు నాటే ప్రదేశాలు గుర్తించాల న్నారు. పనులకు గ్రామ పంచాయతీ తీర్మానం చేసి, మండల పరిషత్ కార్యాలయంలో అందించాలని ఆదేశించారు. ప్రతి గ్రామములో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకు ఎకరం ప్రభుత్వ స్థలం గుర్తించాలన్నారు. గత సంవత్సరం హరితహారం లో నాటిన మొక్కలలో చనిపోయిన వాటిని గురించి మరో మొక్కను నాటాలన్నారు. జీపీ ట్రాక్టర్ట్యాంకర్ ద్వారా నీరు పట్టాలన్నారు. నీతి అయోగ్ పండ్స్ ద్వారా అంగన్వాడీ సెంటర్ల లో కనీస సౌకర్యాలు, మరమ్మత్తు పనులు మంజూరయ్యాయని, వేగవంతంగా పూర్తి చేయించాలని ఆదేశించారు. మన ఊరు మనబడి పనుల పూర్తికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మండల పంచాయతీ అధికారి ప్రసాద్, పంచాయతీరాజ్ డివిజనల్ ఇంజినీర్ సాయిలు, తదితరులు పాల్గొన్నారు.