Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నెక్కొండ
చైల్డ్‌లైన్ సేవలు వనియోగించుకోవాలని చైల్డ్ లైన్ జిల్లా సభ్యుడు రమేష్ అన్నారు. బుధవారం మండలంలోని గుండ్ర పల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ రాజేశ్వరావు అధ్యక్షతన ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడారు. పిల్లల సమస్యలను గుర్తించి పై అధికారుల దృష్టికి తీసుకెళ్లడమే ఈ కార్యకమ ఉద్ధేశం అన్నారు. 0-18ఏండ్లలోపు బాల బాలికల రక్షణ, సంరక్షణకు చైల్డ్ లైన్ 1098 పని చేస్తుందని వివరించారు. సర్పంచ్ రాజేశ్వరరావు మాట్లాడుతూ చైల్డ్ లైన్ సేవలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని అన్నారు. బాలలతో పనులు చేపించొద్దని, ప్రతి ఒక్కరు చదువుకోవాలని చెప్పారు అంగన్ వాడీ టీచర్ అచ్చమ్మ మాట్లాడుతూ భ్రూణహత్యలు నేరమ న్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ రవికుమార్, చైల్డ్ లైన్ జిల్లా సభ్యులు హరీష్, మహేష్, వివో శోభారాణి, సుభాషిణి, అరుణ, భూలక్ష్మి, ఆశ వర్కర్ సమతా, కారోబార్లు, తదితరులు పాల్గొన్నారు.