Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - స్టేషన్‌ఘన్‌పూర్
గ్రామ ప్రజల అభిప్రాయంతో డబల్ ఇండ్లను కేటాయిం చాలని మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు బుధవారం ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సానూకూలంగా స్పందించి, అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో జెడ్పీ స్టాండింగ్ ఛైర్మన్ మారపాక రవి, సర్పంచ్ గోవిందు ఆనందం, ఎంపీటీసీ బెల్లపు వెంకటస్వామి,గ్రామశాఖ అధ్యక్షులు గంగుల శ్రీనివాస్ రెడ్డి, గోవిందు అశోక్ , మాజీ ఎంపీటీసీ పులిగిల్ల పార్వతిగట్టయ్య, జోగు లింగస్వామి, గండి రాజయ్య, మెరుగు కుమారస్వామి, ముక్కెర రవి, ముక్కెర కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు.