Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి
నవతెలంగాణ-బచ్చన్నపేట
కాంగ్రెస్తోనే అభివద్ధి సాధ్యమని మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని కొన్నె లింగంపల్లి, మన్సాన్పల్లి, సాల్వపూర్ గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నెలలోపు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తుందని, ఇందిరమ్మ రైతు భరోసా పథకం ఏర్పాటు చేస్తామని అన్నారు. రైతులకు అనుకూలంగా ఉండేలా పరిపాలన సాగిస్తుందని తెలిపారు. అనంతరం ఇంటింటికి వెళ్లి వరంగల్ డిక్లరేషన్ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నల్లగోని బాలకిషన్ ,సింగిల్ విండో మాజీ చైర్మన్ జిల్లెల్ల సిద్ధారెడ్డి,మాజీ ఎంపీపీ పర్శరాములు, జంగిటి విధ్యానాథ్, మండల ఉపాధ్యక్షుడు జ్యోతి భాస్కర్, సందుల రాము, కోడవటార్ దేవస్థాన మాజీ ఛైర్మన్ సురేందర్ రెడ్డి, అమత రెడ్డి,మ్యాక కిష్టయ్య ,పర్శ రాములు, మాజీ సర్పంచ్ చొక్కం నరసింహులు, తమ్మడపల్లి కాంగ్రెస్ నాయకులు రాజిరెడ్డి , దబ్బాగుంటపల్లి నాయకులు రొండ్ల శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ సింగరయ్య, మాజీ డీసీసీబీ డైరెక్టర్ కిష్టయ్య, సీనియర్ నాయకుడు ముత్యంరెడ్డి, లింగంపల్లి మాజీ సర్పంచ్ ఐలయ్య, రామచంద్రగుడెం మాజీ సర్పంచ్ ఆముదాల మల్లారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.