Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
నవతెలంగాణ-భూపాలపల్లి
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వ హించాలని జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో జూన్ 2వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల పై కలెక్టర్ మాట్లాడారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం జిల్లాలో నిర్వహించనున్న ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్య సలహాదారులు డాక్టర్ రాజీవ్ శర్మ హాజరవుతున్నారని, ఏర్పాట్లు ఘనంగా ఉండాలని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర 8వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2 న జిల్లాలో వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఆవిర్భావ దినోత్సవ వేడుకల అనంతరం సాయంత్రం 5 గంటలకు సింగరేణి క్లబ్ హౌస్‌లో కవి సమ్మేళనం కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అదనపు కలెక్టర్ దివాకర, జిల్లా జాయింట్ కలెక్టర్ కే స్వర్ణలత, జిల్లా ఎస్పీ సురేందర్‌రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
వైద్య పరికరాల ఏర్పాటుకు చర్యలు
పీహెచ్‌సీల్లో వైద్య పరికరాల ఏర్పాటుకు తగు చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ భవేష్ మిశ్ర తెలిపారు. బుధవారం ఈసీఐఎల్ ఆల్ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి కలెక్టర్ మాట్లాడారు. ఆస్పిరేషన్ జిల్లాలలో ఈసీఐఎల్ కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల ద్వారా జిల్లాలలో వైద్య సేవలు మెరుగు పరిచేందుకు నిధులు మంజూరు చేయను న్నారన్నారు. భూపాలపల్లి జిలా పీహెచ్‌సీల్లో వైద్య యంత్రాలు, పరికరాల కోసం ఈసీఐఎల్‌కు నివేదిక అంద జేశారు. ఈసీఐఎల్ అధికారులు జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలను పరిశీలించి నివేదికను ఈసీఐఎల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌కు పంపుతారని తెలిపారు. దీనిని పరిశీలించిన డైరెక్టర్స్ యంత్ర పరికరాలు కొనుగోలు చేయుటకు నిధులు మంజూరు చేయనున్నారని అన్నారు. ఈసీఐఎల్ సీఎంఓ డాక్టర్ పి ప్రవీణ్ బాబు, ఆస్పిరేషన్ జిల్లా కన్వీనర్(సీపీఓ) శామ్యూల్, సీనియర్ డీజీఎం సీహెచ్ శ్రీనివాస్, సీఎస్ఆర్ అధికారి సునీల్ కుమార్, డీఎంహెచ్ఓ శ్రీరామ్ ు సిబ్బంది పాల్గొన్నారు.