Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దుబ్బపేటలో నాలుగు ఇండ్లు ధ్వంసం
- పాక్షికంగా దెబ్బతిన్న 15 ఇండ్లు
- ప్రభుత్వం ఆదుకోవాలి : బాధితులు
నవతెలంగాణ-మల్హర్రావు
గ్రామ ప్రజలంత వ్యవసాయ,ఉపాధిహామీ వివిధ రకాల పనులు ముగించుకొని ఇంటిబాట పట్టారు. రాత్రి కాగానే తిని రోజులాగే నిద్రలోకి జారు కున్నారు. అర్ధరాత్రి అకాలంగా ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సష్టించింది. భారీగా శబ్దాలు వినిపించడంతో ప్రజలు ఉలిక్కిపడారు. నిద్రలో నుంచి లేచే క్షణాల్లోనే రేకుల ఇంటి పైకప్పులు, పెంకుటిల్లు, ఇంటిముందు వేసిన రేకులు గాలి దుమారానికి ధ్వంసమై తటిలో ప్రజలకు భారీ ప్రమాదం తప్పింది. ఈ సంఘటన మండలంలోని దుబ్బపేటలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసు కుంది. ఇండ్లు పూర్తిగా దెబ్బతున్న, పాక్షికంగా దెబ్బతిన్న బాధిత కుటుంబాల కథనం ప్రకారం... అకాల వర్షం.. భారీ ఈదురుగాలుల శబ్ధాలతో కుటుంబ సభ్యులతో ఇంట్లో నుంచి బయటకు వస్తున్న క్షణాల్లోనే ఇంటి పైకప్పులు, గోడలు, ఇంటి ముందు ఉన్న రేకులు ధ్వంసమై దెబ్బతిన్నాయి. అజ్మీరా రమేష్ నాయక్,అజ్మీరా సుధాకర్ నాయక్, అజ్మీరా జగన్, లక్ష్మీకి చెందిన ఇండ్లు పూర్తిగా దెబ్బ తిని ఒక్కొరికి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు నష్టం జరిగిందని, ఇదే గ్రామానికి చెందిన మరో 15మంది ఇండ్లు,ఇకటిముందు రేకులు పాక్షి కంగా దెబ్బతిన్నాయని, అడ్వాలపల్లిలో అజ్మీరా రాజు నాయక్ ఇల్లు పాక్షికంగా దెబ్బతిందని బాధితులు లబోదిబోమంటూ గుండెలు బాదుకున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకొంటున్నారు.
ఎంపీపీ,తహసీల్ధార్ పరిశీలన
గాలిదుమారానికి ఇంటి పైకప్పులు కొట్టుకు పోయి దెబ్బతిన్న ఇండ్లను బుధవారం ఎంపీపీ చింతలపల్లి మలహల్రావు, తహసీల్ధార్ శ్రీనివాస్, ఆర్ఐ సరితా, సర్పంచ్ అజ్మీరా ప్రమిల రాజునాయక్, పంచాయతీ కార్యదర్శి చల్ల ప్రవీణ్ పరిశీలించారు. గ్రామంలో అజ్మీరా రమేష్,అజ్మీరా సుధాకర్, అజ్మీరా జగన్,లక్ష్మ నలుగురి ఇండ్లు పూర్తిగా,15 మంది ఇండ్లు పాక్షికంగా,అడ్వాలపల్లిలో ఒక్కరి ఇల్లు దెబ్బతున్నాయని, పూర్తి నివేదికను భూపాలపల్లి జిల్లా ఉన్నతాధికారులకు అందజేస్తామని, బాధితులు అదైర్య పడొద్దని, ఆర్థికసాయమందేలా చూస్తామని అధికారులు తెలిపారు.
మున్నాళ్ళ ముచ్చటగా రైతు వేదిక
రైతులకు సలహాలు, సూచనలు, సమావేశాలు, మట్టి నమూనాలు పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒక్కొక్క క్లస్టర్‌కు రూ.22 లక్షలు వెచ్చించి మండలంలో తాడిచెర్ల, మల్లారం, రుద్రారం, కొయ్యూర్ గ్రామాల్లో రైతు వేదికలు నిర్మిం చారు. పంచాయతీరాజ్ అధికారుల నిర్లక్ష్యంగా నాణ్యతా లోపంతో నిర్మించారు. కాగా అకాల గాలిదు మారంతో మల్లారం గ్రామంలో రైతు వేదిక పైకప్పు తోపాటు పూర్తిగా ధ్వంసమై రూ.22 లక్షల ప్రజా ధనం దుర్వినియోగమైందని రైతులు ఆరోపిస్తు న్నారు. ధ్వంసమైన రైతు వేదికను పంచాయతీ రాజ్, వ్యవసాయ అధికారులు పరిశీలించకపోవడం గమనార్హం.