Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహాదేవపూర్
మహదేవపూర్ మండలంలోని కుదురుపల్లి ఎల్కేశ్వరం గ్రామాలలో బుధవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో చిరుధాన్యాలపై అంగన్వాడీ కార్యకర్తలు, ఆశ వర్కర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ రాణి భారు, జెడ్పీటీసీ గుడాల అరుణ, సీడీపీఓ రాధిక ప్లాఒ్గని మాట్లాడారు. చిరుధాన్యాల వల్ల గర్భిణులు, బాలింతలకు పోషకాహారం లభిస్తుందన్నారు. రక్తహీనత లేకుండా ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు కోట లక్ష్మి సమ్మయ్య, ఇమ్మడిశెట్టి మలక్క, అంగన్వాడీ సూపర్వైజర్ సరస్వతి మమత, ఉపసర్పంచ్ గాడిపెళ్లి సమ్మయ్య పాల్గొన్నారు.