Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్
నవతెలంగాణ-మట్టెవాడ
రైతులకు నకిలీ విత్తనాలు అంటగట్టి మోసాలకు పాల్పడితే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ హెచ్చరించారు. బుధవారం వరంగల్ సీపీ తరుణ్ జోషి ఆదేశాల మేరకు వరంగల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, వ్యవసాయశాఖ అధికారులు విత్తనాల షాపులల్లో ఆకస్మిక దాడులు నిర్వహించారు. వరంగల్ జిల్లా చౌరస్తాలోని పరమేశ్వరి అగ్రో ఏజెన్సీతో పాటు చౌరస్తాలోని మిగతా షాపులు, అనంతరం మచ్ఛపుర్ గ్రామం, గీసుగొండ లోని పలు ఫెర్టిలైజర్ షాపులని తనిఖీలు చేపట్టి రికారులు పరిశీలించారు. కాలపరిమితి అయిపోయిన విత్తనాలను గుర్తించి సీజ్ చేశారు. అనంతరం టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ మాట్లాడుతూ... వానాకాలం పంటల కోసం రైతులు మేలురకం విత్తనాలను కొనుగోలు చేస్తారన దానిని ఆసరా చేసుకుని కొందరు వ్యాపారస్తులు నకిలీ విత్తనాలను అంట గట్టి రైతులను మోసం చేస్తున్న సంఘటనలు ఏండ్లుగా జరుగుతున్నాయన్నారు. ఇలాంటివి పున రావృతం కాకుండా ఫెస్టిసైడ్స్, సీడ్స్ షాపుల్లో దాడులు నిర్వహి స్తున్నామ న్నారు. ఎవరైనా అలాంటి విత్తనాలు గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. టాస్క్ఫోర్స్ సీఐ సంతోష్, ఎస్ఐ ప్రేమనంధం, వ్యవయసాయ శాఖ అధికారి అనురాధ, మిల్స్ కాలనీ సీఐ మల్లేష్, టాస్క్ఫోర్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.