Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
కార్మికుల శ్రేయస్సుకే చైతన్యమాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినరు భాస్కర్ తెలిపారు. బుధవారం బల్దియా పరిధి 11 వ డివిజన్ పోతన ట్రాన్స్ ఫర్ స్టేషన్లో స్వచ్ఛ ఆటో సిబ్బంది, ర్యాక్ పికర్స్తో ఏర్పాటు చేసిన సమావేశంలో నగర మేయర్ గుండు సుధారాణితో కలిసి చీఫ్ విప్ పాల్గొన మాట్లాడారు. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని, కేవలం కార్మిక దినోత్సవాన్ని ఒక్కరోజున మాత్రమే నిర్వహించకుండా ఈ మాసం మొత్తం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇటీవల కార్మిక దినోత్సవం కూడా ఏర్పాటు చేశామన్నారు. అసంఘటిత రంగ కార్మికులు వారికి ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. హెల్త్ క్యాంపు కూడా ఏర్పాటు చేసి 510 మందికి పరీక్షలు చేసి 270 మందికి మందులు అందజేశామన్నారు. తీవ్రమైన వ్యాధులతో ఇబ్బంది పడుతున్న 9 మందిని గుర్తించామని, కార్మికుల స్థితి గతులు మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. కార్మికుల పిల్లలు కూడా ఉన్నత చదువులు చదవాలని, అసంఘటిత రంగ కార్మికులు వారికున్న భీమా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. రూ. 110 చెల్లించడం ద్వారా అనేక రకాల బెనిఫిట్స్ కార్మికులు పొందొచచని అన్నారు. నగర మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ ఇటీవల పారిశుధ్య సిబ్బంది ఆరోగ్య పరిరక్షనే ధ్యేయంగా సుమారు రూ.1500 విలువైన హైజినిక్ కిట్లను అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ విజయ లక్ష్మి సురేందర్, ముఖ్య ఆరోగ్య అధికారి రాజారెడ్డి, శానిటరీ సూపర్ వైజర్లు సాంబయ్య, పసునూరి భాస్కర్, జవాన్లు తదితరులు పాల్గొన్నారు.