Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నగర మేయర్ గుండు సుధారాణి
నవతెలంగాణ-వరంగల్
బల్దియా పరిధి ప్రతి డివిజన్లో క్రీడా ప్రాంగణాలు, పట్టణ ప్రకృతి వనాలు, నర్సరీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు బల్దియా మేయర్ గుండు సుధారాణి తెలిపారు. మహా నగరంలోని పలు డివిజన్లలో క్రీడా ప్రాంగణాలు, పట్టణ ప్రకృతి వనాలు, నర్సరీలు ఏర్పాటుకు ఎంపిక చేసిన స్థలాలలను పరిశీలించారు. కుమార్పల్లి ప్రభుత్వ బాలికల పాఠశాల ఆవరణలో, వడ్డెపల్లి ప్రభుత్వ బాలికల పాఠశాల ఆవరణలో, క్రీడా ప్రాంగణముల స్థలానలను పరిశీలించారు. వడ్డెపల్లి బండ్ వద్ద నిర్వహిస్తున్న నర్సరీని, పట్టణ ప్రకృతి వనం,గ్రీన్ లెగసిని పరిశీలించి పలు సూచనలు చేశారు. పట్టణ ప్రగతి కింద బల్దియా పరిధిలో మొదటి విడతలో 24 తెలం గాణకు క్రీడా ప్రాంగణాలు, 23 నర్సరీలు, 36 పట్టణ ప్రకృతి వనాలు ఏర్పాటుకు స్థలాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. అదనవు కమిషనర్ రషీద్, ఎస్ ఈ సత్యనారాయణ, సిపి వెంకన్న, ఈ ఈ లక్ష్మరెడ్డి, హెచ్ ఓ ప్రిసిల్లా, స్మార్ట్ సిటీ పీిఎంఈ ఆనంద్, డీఈ రవికుమార్ పాల్గొన్నారు.