Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బల్ధియా కమిషనర్ పి ప్రావీణ్య
నవతెలంగాణ-వరంగల్
నగరంలో ప్రతి ఇంటికి తాగునీటి సరఫరా క్రమం తప్పకుండా జరగా లని బల్దియా కమిషనర్ పి ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో బుధవారం ఈఎల్ఎస్ఆర్లలో నీటిని నింపడం, నీటి సరఫరా, లీకేజీలు, నల్లా కనెక్షన్ల సర్వే పురోగతి పై బల్దియా, పబ్లిక్ హెల్త్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ... నీటి సరఫరా సమయ పట్టికను అమలు చేయాలన్నారు. ప్రతి గృహానికి నల్లా కనెక్షన్ ఇవ్వాలని అన్నారు. నిర్దేశిత సమయంలో సరఫరాలో నిర్లక్ష్యం జరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. తక్కువ నీటి ప్రెషర్ ఉన్న ప్రాంతాల్లో అంతర్గత కనెక్షన్లు, లికేజ్లు, లోపాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు. రహదారిలో నీటి సరఫరాకు జరిగే పని సందర్భంగా ఎలాంటి సంఘటనలు, ప్రమాదాలు జరగకుండా హెచ్చరిక బోర్డ్ ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇంటింటి నల్లాల సర్వే లో బల్దియా వ్యాప్తంగా మొదటి విడతలో 1.15 లక్ష కనెక్షన్లకు 84 కనెక్షన్ల సర్వే చేసి సంవత్సరానికి రూ.3.63 కోట్ల డిమాండ్ జనరేట్ చేశామన్నారు. మిగతా సర్వే పూర్తి చేయాలని తెలిపారు.ఈ సమీక్షలో ఎస్ఈలు సత్యనారాయణ, ప్రవీణ్ చంద్ర, పబ్లిక్ హెల్త్, బల్దియా ఈఈలు రాజ్‌కుమార్, రాజయ్య, డీఈలు, ఏఈలు, తదితరులు పాల్గొన్నారు.