Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-టేకుమట్ల
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్రీడా మైదానాల ఏర్పాటుకు గ్రామాల్లో క్రీడా స్థలాలను వెంటనే గుర్తించాలని ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి అన్నారు. బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో అనిత, గ్రామ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ, ఎంపీడీవో మాట్లాడుతూ గ్రామాల్లో యువత వివిధ ఆటలు ఆడుకోవడానికి ప్రభుత్వం క్రీడా మైదా నాలు ఏర్పాటు చేసే కార్యక్రమం చేపట్టిందన్నారు. గ్రామ సభల ద్వారా ప్రతి గ్రామంలో ఎకరం ప్రభుత్వ భూమిని గుర్తించి ఎంపిక చేయాలని ఆదేశించారు. జూన్ 2న క్రీడా మైదానాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఉం టుందన్నారు. ఉపాధి హామీలో కూలీల సంఖ్య పెంచాలన్నారు. హరిత హారంలో మొక్కలు నాటేందుకు గ్రామాల్లో స్థలాలు గుర్తించాలన్నారు. విధుల పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండి పనిచేయాలన్నారు. ఈ సమా వేశంలో ఎంపీఓ రాంప్రసాద్, ఏపీవో మాధవి, ఈసీ రాము, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.