Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సొసైటీ చైర్మన్ పోరెడ్డి. పూర్ణచంద్రారెడ్డి
నవతెలంగాణ-గణపురం
రైతులు వరి నాట్లు ముందస్తుగా వేసుకోవాలని గణపురం ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. బుధవారం మండలంలోని లక్ష్మారెడ్డి పల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సంధర్బంగా చైర్మెన్ మాట్లాడుతూ రైతులు అధైర్య పడొద్దని, రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందన్నారు. వరి పండించే రైతులు వానాకాలం ముందస్తుగా నారు పోసుకొని నాట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. ముందస్తు నాట్లు వేయడం వల్ల యాసంగి పంట కూడా ముందస్తుకు వీలుంటుందని తెలిపారు. అలాగైతే రైతులు వర్షాల భారిన పడకుండా పంట చేతికందే అవకాశం ఉంటుందన్నారు. చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నారు. కొనుగోలు నిర్వహణ లో ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు ఉన్నా వెంటనే తనకు గానీ, పాలక వర్గం దృష్టికి గాని తీసుకురావాలన్నారు. రైతులకు సేవ చేయడానికి నిరంతరం 24 గంటలు అందుబాటులో ఉంటామన్నారు. రైతులు తాలు, తేమ లేని ,నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఒద్దుల విజయ, ఎంపీటీసీ మారగాని సరస్వతి, సీఈఓ గోవర్ధన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు పొలుసాని లక్ష్మీనరసింహారావు, రైతులు మల్లారెడ్డి, జయపాల్ రెడ్డి, రవీందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, చంద్రారెడ్డి,సుధాకర్ రెడ్డి, రఘుపతి రెడ్డి, రాంరెడ్డి, వాసుదేవరెడ్డి, రాజిరెడ్డి,కుమార్ రెడ్డి, శంకర్, బుచ్చిరెడ్డి, రమణారెడ్డి, కిట్టు,సమ్మిరెడ్డి, సలెందర్ రెడ్డి, ప్రణరు, వెంకటేష్, రాజు, తదితరులు పాల్గొన్నారు.