Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా
నవతెలంగాణ-భూపాలపల్లి
జిల్లాలో క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా అన్నారు. బుధవారం కేంద్రంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ హాజరై మాట్లాడారు. క్షయ వ్యాధి నివారణ కార్యక్రమంలో జిల్లా వెనుకబడి ఉందని, టీబీ బాధితులకు ప్రభుత్వం రూ.500 ఆర్థికసాయం చికిత్స పూర్తయ్యే వరకు ఆరు నెలల పాటు వారి ఖాతాలో జమ చేస్తుందన్నారు. ఈ సహాయము అందరికీ అందేలా చూడాలని ఆదేశించారు. 2021 నుండి నెలల వారిగా టీబీ కేసులు నమోదు, వారికి అందే పారితోషికం గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రామాలలో టీబీ లక్షణాలున్న వారిని గుర్తించి పరీక్షలు చేసి వ్యాధిని నిర్ధారించాలన్నారు. పీహెచ్సీలకు కేటాయించిన వార్షిక లక్ష్యాలు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ శ్రీరామ్, డిప్యూటీ డీఎంహెచ్ఓ కొమురయ్య, పీఓ ఎంసీహెచ్ డాక్టర్ శ్రీదేవి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి రవికుమార్, ఎన్సీడీ ప్రోగ్రామ్ ఆఫీసర్ గోపీనాథ్, డెమో శ్రీదేవి, పీహెచ్సీ వైద్యాధికారులు పాల్గొన్నారు.