Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్మెట్ట
అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఫలాలను ప్రజలకు అందేలా చర్యలు తీసుకో వడంతోపాటు మండల అభివద్ధిపై దష్టి సారిం చాలని ఎంపీపీ తేజావత్ గోవర్ధన్ అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. మండల సర్వసభ్య సమావేశానికి గైర్హాజరవుతున్న ప్రభుత్వ అధికారుల తీరుతో సర్పంచుల ఆశలు నేరవేరట్లేదు. అధికారులు గ్రామాల సందర్శన ముందస్తు సమాచారం ప్రజాప్రతినిధులకు అంద డం లేదని, మండలకేంద్రంలో మినీ వ్యవసాయ మార్కెట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. చెరువులు, కుంటలు ఆక్రమణకు గురవుతున్నాయని మండిపడ్డారు. సర్వేనిర్వహించి హద్దులు ఏర్పాటు చేయాలని సర్పంచులు నర్రా వెంకట రమణారెడ్డి, రామిని శివరాజ్ గుప్తా కోరగా సంబంధిత అధికారులు సహకరిస్తే సర్వేనిర్వహించి హద్దులు ఏర్పాటు చేస్తామని తహసీల్దార్ గంగా భవాని తెలిపారు. గ్రామాల్లో ఇనుప విద్యుత్ స్థంభాలనుతొలగించాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసి మాలోత్ శ్రీనివాస్, జెడ్జీ కోఆప్టెడ్ ఎండీ గౌస్, చేర్యాల వ్యవసాయ మార్కెట్ చైర్మెన్ సుంకరి మల్లేషంగౌడ్, ఎంపీడీఓ ఖాజా మొయిఉద్దీన్, ఏపీఓ రమాదేవి, అనురాధ, గుడిమల్ల దూతి వైద్యాధికారి మోసెజ్, ఏఈలు నవదీప్, ప్రశాంత్, ప్రదీప్, బాబూరావు, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.