Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కోల్బెల్ట్
వినియోగదారులకు సకాలంలో వారి డిమాండ్లను అనుసరించి నాణ్యమైన బొగ్గును అందించాలని జీఎం(మార్కెటింగ్) ఎం సురేష్ అన్నారు. గురువారం భూపాలపల్లి జిల్లాలో పర్యటించిన ఆయన కేటీకే ఓసీ-2,3 ప్రాజెక్టులను సందర్శించి ఉత్పత్తి, ఉత్పాదకత, రవాణా గురించి ప్రాజెక్టు అధికారులకు తగు సూచనలిచ్చారు. అనంతరం ఏరియా లోని అన్ని గనుల ఏజెంట్లు, మేనేజర్లతో జీఎం కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీ-5, జీ-11 గ్రేడ్ నాణ్యతగల బొగ్గును అధికంగా ఉత్పత్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఇన్చార్జి జీఎం బీవీ రమణ, డీజీఎం(మార్కెటింగ్) టి శ్రీనివాస్, డీజీఎం(క్వాలిటీ) కవీంద్ర ,అన్ని గనుల ఏజెంట్లు, మేనేజర్లు పాల్గొన్నారు.