Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిట్యాల
వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసి త్వరి తగతిన మిల్లర్లకు పంపించాలని జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా ఐకేపీ సెంటర్ల నిర్వాహకులకు సూచించారు. గురువారం మండలంలోని ఒడి తల, జడల్పేట(గాంధీనగర్) గ్రామాల్లో క్రీడామైదానాలకు పూజ చేశారు. గ్రామాల అభివద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కషి చేయాలని సూచించారు. అనంతరం మండల కేంద్రంలోని వ్యవసాయ సబ్ యార్డు మార్కెట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, పశు వైద్యశాలను తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... రైతులకు ఎలాంటి ఇబ్బందులు జరగ కుండా చూసుకోవాలని సూచించారు. మండల కేంద్రంలోని పశు వైద్యశాల భవనం శిథిలావస్థలో ఉందని, నూతన భవనం మంజూరు చేయాలని జెడ్పీటీసీ గొర్రె సాగర్ కోరగా నిధులు మంజూరు చేయిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఇక్కడి ప్రాంత అభివద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు. సమస్యలుంటే తన దష్టికి తీసుకొస్తే పరిష్కారించేందుకు కషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రామయ్య, పీఏసీఎస్ చైర్మెన్ కుంభం క్రాంతికుమార్‌రెడ్డి, ఏవో నాలికే రఘుపతి, సర్పంచులు ఎర్రబెల్లి సాంబలక్ష్మి, కామిడీ రత్నాకర్‌రెడ్డి, పూర్ణచందర్రావు, చిట్యాల ఎంపీటీసీ కట్కూరి పద్మ నరేందర్, అబ్దుల్ హలీం, రవికుమార్ పాల్గొన్నారు.