Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫైళ్ల ఆశయ్య,
- రాష్ట్ర అధ్యక్షుడు గుమ్మడిరాజుల నరేష్
నవతెలంగాణ-జనగామ
అర్హులైన రజకులందరికీ రుణాలు అందించాలని రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫైళ్ల ఆశయ్య, రాష్ట్ర అధ్యక్షుడు గుమ్మడి రాజుల నరేష్ డిమాండ్ చేశారు. గురువారం జనగామ జిల్లా కేంద్రంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో ఏదునురు మదర్ అధ్యక్షతన నిర్వహించిన సంఘం జిల్లా కమిటీ సమావేశంలో రజకుల సమస్యలపై చర్చించారు. జూన్ 21న సంఘం జనగామ రెండవ మహాసభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిదేండ్లుగా రజకులకు రుణాలు ఇవ్వాకూండా కాలయాపన చేస్తోందని విమర్శించారు. జీఓ-190 ప్రకారం దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరికీ వెంటనే రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక గ్రామాల్లో రజకులకు కేటాయించిన ఇనామ్ భూములు, చాకిరేవు స్థలాలకు పట్టాలు ఇవ్వాలన్నారు. ఇండ్ల స్థలాలు లేనిబ వారికి స్థలాలు ఇచ్చి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించివ్వాలన్నారు. 50ఏండ్లు నిండిన రజక వత్తిదారులకు వద్ధాప్య పింఛన్ ఇవ్వాలని కోరారు. రజకులకులపై జరుగుతున్న దాడులు , దౌర్జన్యాలను అరికట్టేందుకు ప్రత్యేక రక్షణ చట్టం చేయాలన్నారు. రజక ఫెడరేషన్‌కు పాలకవర్గం నియమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు అక్కెనపల్లి వెంకటేశ్వర్లు, రాష్ట్ర సహాయ కార్యదర్శి జ్యోతి ఉపేందర్, జనగామ జిల్లా అధ్యక్ష/ కార్యదర్శులు ఏదునురి గట్టేశం ,కోలిపాక నరసింహ, సింగారపు రమేష్, మైలారం వెంకటేశ్వర్లు రెడ్డిరాజుల నారాయణ, పాండ్యాల అంజయ్య, లోంక ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.