Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ
నవతెలంగాణ- కోల్బెల్ట్
సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సమస్యల పరిష్కారానికి ఈ నెల 30న నిర్వహించే ఛలో కొత్తగూడెం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది. గురువారం జయశంకర్ జిల్లా కేంద్రంలోని కొమురయ్య భవన్లో జేఏసీ నాయకులు కంపేటి రాజయ్య(సీఐటీయూ), కుడుదుల వెంకటేష్(ఏఐటీయూసీ), దేవదాస్(హెచ్ఎంఎస్), నర్సింగం( ఐఎఫ్టీయూ) నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. 30 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ కార్మికులు చాలీచాలని జీతాలతో బతుకీడుస్తున్నారని అన్నారు. వారి సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పోరాడేం దుకు కార్మిక సంఘాల జేఏసీగా ఏర్పడ్డాయని అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతున్న ప్రభుత్వం కార్మికుల జీతాలు మాత్రం పెంచట్లేదని మండిపడ్డారు. ఇలా అయితే జీడీపీ ఎలా పెరుగు తుందని ప్రశ్నించారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఔట్సోర్సింగ్ ఉండదని చెప్పి ఏడేండ్లు గడుస్తున్నా పట్టింపు లేదని అన్నారు. పైగా తెలంగాణలో కాంట్రాక్ట్ కార్మికులే లేరని అనడం బాధాక రమని అన్నారు. 25,000మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉంటే 11వేల మంది ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేస్తామని, కేవలం విద్యుత్తు రంగ కార్మికులను పర్మినెంట్ చేసి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. ఛలో కొత్తగూడెం కార్యక్రమం సింగరేణి యాజమాన్యానికి ఒక అల్టిమేటం సభ అని అన్నారు. ఆర్ఎల్సీ కూడా నిర్లక్ష్య ధోరణి తో వ్యవహరిస్తోందన్నారు. కోల్ ఇండియాలో జరిగిన తొమ్మిదో వేతన ఒప్పందం ప్రకారం వేతనాలు పెంచి ఇస్తామన్న యాజమాన్యం మే 8న ఆర్ఎల్సి చర్చలకు పిలిచినప్పుడు ఒప్పందంలో యాజమాన్యం సంతకమే పెట్టలేదని అబద్దాలు ఆడిందని మండిపడ్డారు. కోల్ ఇండియాలో అమలైన హైపవర్ కమిటీ వేతనాలు, సింగరేణి అమలవకపోవడాన్ని వ్యతిరేకి స్తున్నామన్నారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులను గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలలో విలీనం చేస్తే ఊరుకునేది లేదని తద్వారా కార్మికులు నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారం దిశగా యాజమాన్యం చర్యలు తీసుకోకుంటే మే 30 ఛలో కొత్తగూడెం కార్యక్ర మంలో కార్పొరేట్ ఆఫీసులను దిగ్బంధం చేసి కార్యకలాపాలను స్తంభింప చేస్తామని హెచ్చరించారు.