Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి
- తెలంగాణ రైతు సంఘం
- రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్
నవతెలంగాణ-రఘునాథపల్లి
ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్లే నేడు వ్యవసాయం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని ఫలితంగా రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని తెలం గాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ విమర్శించారు. రఘునాథపల్లి మండలం కుర్సపల్లి గ్రామం లో తెలంగాణ రైతు సంఘం సమావేశం మంచాల అయోధ్య, కాసాని వెంకన్న అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మూడ్ శోభన్ పాల్గొని మాట్లాడారు. కేంద్ర వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన రైతు ఉద్య మ ఫలితంగా మోడీ ప్రభుత్వం దిగొచ్చి ఇచ్చిన హామీలను అమలు చేయట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పంట లకు కనీస ధర రాక నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశా రు. వ్యవసాయాన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టాలనే కేంద్ర ప్రభుత్వ కుట్రలు నేటికీ కొనసాగుతున్నాయని చెప్పా రు. అందుకే మద్దతు ధరల గ్యారెంటీ చట్టం తీసుకురావ డానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పంటల కొనుగోలు వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోందన్నారు. కేంద్ర బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి భారీగా నిధుల కోత పెడుతున్నారని విమర్శించారు. పంట రుణాలు అందకపోవడంతో ప్రైవేటు అప్పుల పై ఆధారపడి వ్యవసాయం చేయాల్సి వస్తోందన్నారు. ప్రకతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయిన సందర్భాల్లో రైతాంగాన్ని ఆదుకో వడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. రైతులకు ధీమా.. పంటల బీమా అని కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేసిందని ఆచరణలో బీమా పథకం అమలు ఏదని ప్రశ్నించారు. విత్తన కంపెనీల మోసాలకు గురై రైతులు నష్టపోతున్నా విత్తన చట్టం ఎందుకు తేవడం లేదని అన్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతాం గాన్ని ఆదుకునేందుకు రుణ విమోచన చట్టం తేవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. విద్యుత్ సవరణ బిల్లు చట్టం అమలు కాకముందే రాష్ట్రంలో వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల రైతులు భవిష్యత్‌లో ఉచిత విద్యుత్ కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉచిత విద్యుత్‌కు నగదు బదిలీ వద్దని, ప్రస్తుత విధానాన్నే కొనసాగించాలని అన్నారు. భూముల ఆన్లైన్, పట్టాదారు పాసుపుస్తకాలు వంటి సమస్యలను పరి ష్కరించాలని కోరారు. ఢిల్లీ రైతాంగ పోరాట అమరవీరుల స్ఫూర్తితో జిల్లాలో రైతాంగ ఉద్యమాలను చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకులు భూక్యా చందు నాయక్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు గంగాపురం మహేందర్, రైతులు కాసాని పుల్లయ్య, బందా రవీందర్, నరేష్, వెంకటయ్య, కొమరయ్య, నరేష్, యకయ్య, ఎల్లయ్య, మల్లేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.