Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ కలెక్టరేట్
నిర్ధేశించుకున్న రుణ లక్ష్యాలను నిర్ణీత సమయంలో 100శాతం సాధించేందుకు కషి చేయాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బ్యాంకర్లతో జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం, జిల్లాస్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహిం చారు. జిల్లా లీడ్ బ్యాంకు అధికారి మాట్లాడుతూ 2021-22లో వార్షిక లక్ష్యం రూ.2717.56 కోట్లు కాగా రూ.1673.84 కోట్లతో 60శాతం రుణ లక్ష్యాన్ని సాధించి రాష్ట్రంలో రెండవ స్థానంలో నిలిచామన్నారు. ఈ సంద ర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన ఎస్సీ, ఎస్టీలకు పీఎం, ఈజీపీ రుణాలు మంజూరు చేయాలన్నారు. నిర్దేశించుకున్న వ్యవసాయ రుణాల లక్ష్యాలను సాధించాలని, గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకుల సేవలు విస్తరించాలని, చిన్న తరహా పరిశ్రమలు ప్రోత్సహించాలని, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మినీ డైరీ ఫామ్స్ విస్తరించాలని సూచించారు. అనంతరం 2022-2023 వార్షిక రుణ ప్రణాళిక సంచికను ఆవిష్కరించారు. అదనపు కలెక్టర్లు భాస్కర్‌రావు, అబ్దుల్ హమీద్, డీఆర్డీఓ రామ్‌రెడ్డి, ఆర్బీఐ ఏజీఎం, ఎల్డీఓ రాజేంద్రప్రసాద్, నాబార్డు ఏజీఎం, డీడీఎం చంద్రశేఖర్, ఎల్డీఎం శ్రీనివాస్, ఎస్బీఐ ఏజీఎం అలీమొద్దీన్, నజీర్ సుల్తానా, తదితరులు పాల్గొన్నారు.