Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విరిగిన చెట్లు.. నేలరాలిన మామిడి
నవతెలంగాణ-పాలకుర్తి
మండలంలో ఈదురు గాలులు బీభత్సం సష్టించాయి. గురువారం తెల్లవారుజామున వీచిన ఈదురు గాలులకు చెట్లు విరిగి రోడ్లపై పడడంతో వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈదురు గాలులకు రోడ్లపై విరిగిపడిన చెట్లను పీఆర్ అధికారులు తొలగించక పోవడంతో పలువురు వాహనదారులు ప్రమాదాలకు గురయ్యారు. మండలంలో చేతికొచ్చిన మామిడి పంట ఈదురుగాలులకు నేలపాలైందని మామిడి రైతులు వాపోయారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యంపై కప్పిన టార్ఫాలిన్లు ఈదురు గాలులకు లేచిపోయాయి. తెల్లవారుజామున విరిగిపడిన చెట్లను తొలగించడంలో పంచాయతీరాజ్ శాఖ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని వాహనదారులు, ప్రజలు ఆరోపించారు. రోడ్లపై అడ్డంగా ఉన్న చెట్లను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని పజలు కోరుతున్నారు.
లింగాలఘణపురం : మండల కేంద్రం తోపాటు అన్ని గ్రామాల్లో బుధవారం అర్థరాత్రి ఈదురుగాలుల తోకూడిన వర్షానికి విద్యుత్ స్థంబాలు నేలకూలీ పోయాయని ఏఈ మధు తెలిపారు. ఎల్టీ లైన్లో రెండు, 11కేవీ లైన్లో నాలుగు స్థంబాలు విరిగిపడడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయమేర్పడింది. దీంతో గురువారం విద్యుత్ సిబ్బంది విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకున్నారు.