Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెట్రోల్ డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తేవాలి : సీపీఐ(ఎం), సీపీఐ
నవతెలంగాణ-భూపాలపల్లి
దేశంలో, రాష్ట్రంలో ధరలను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలహయ్యాయని పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి పేద మధ్యతరగతి ప్రజలపై పెను భారం మోపుతున్నాయని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బంధు సాయిలు, సీపీఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ అన్నారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కొమురయ్య భవన్లో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. దేశంలో ఒకే దేశం ఒకే పన్ను అనే నినాదంతో జీఎస్టీ వేసిన ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ ధరలను జిఎస్టి పరిధిలోకి ఎందుకు తేలేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై రూ.10 తగ్గించిందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్రోల్ డీజిల్ పై టాక్సీ తగ్గించాలని కోరారు. వామపక్షాల ఆధ్వర్యంలో ఈనెల 27న అన్ని తహసిల్దార్ కార్యాలయాలల ఎదుట ధర్నాలు నిర్వహించాలన్నారు. 30న జిల్లా కలెక్టర్ కార్యాల ముందు ధర్నాలు నిర్వహిస్తామన్నారు, 31న హైదరాబాద్ లోని ఇందిరా పార్కు వద్ద నిర్వహించే ధర్నాకు ప్రజలు నాయకులు, మేధావులు, పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నాయకులు కుడుదుల వెంకటేష్, సోతుకుప్రవీణ్ కుమార్, క్యాతరాజు సతీష్, కాంపేటిరాజయ్య, వేల్లిశెట్టి రాజయ్య,మల్లయ్య, శంకర్, సకినాల మల్లయ్య, భూమయ్య తదితరులు పాల్గొన్నారు.