Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖానాపురం
మండల పరిధిలోని అశోకనగర్లో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి 10 రోజులు కావస్తున్నా రైతులకు గన్నీ సంచులు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అకాల వర్షాలతో రైతులు పండించిన పంటలను నష్టపోతాయని ఉద్దేశంతో కొంతమంది రైతులు నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ కన్వీనర్ తక్కళ్లపెళ్లి రవీం దర్రావు ఫోన్‌చేసి చెప్పగా వెంటనే అశోక నగర్ కు వెళ్లి సమస్య తెలుసుకొని జిల్లా పౌర సరఫరాల అధికారితో మాట్లాడగా వెంటనే గన్నీ సంచులు పంపి ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ జాడి అచ్చుతం, గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎల్ది శ్రీనివాస్ పార్టీ నాయకులు పోనుగోటి ప్రవీణ్, ముస్కు మోహన్ గట్టి సారం గపాణి, సమ్మయ్య, మల్లయ్య, రైతులు మాధ వరావు, అశోక్,రాజేందర్ పలువురు పాల్గొన్నారు.