Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజాసేవలో మేకల కరుణాకర్
నవతెలంగాణ-వరంగల్
నేటి పరిస్థితుల్లో సొంత లాభం కోసం ఎంతో తపించే వారు కొంత మంది లేక పోలేదు. కానీ మానవత్వం హదయం కలిగి నిరుపేదలకు సహాయం చేయాలనే గుణం కలిగి ఉండడం కొందరికే సాధ్యం అవుతుంది. అలాంటి వారిలో మేకల కరుణాకర్ ఒకరు. పేద వారి బాధలను తమ బాధ్యతగా తీసుకొని పేద కార్మికులకు పెద్ద దిక్కుగా ఉండి కార్మికులు ఎదు ర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి నిరం తరం ఆయన సేవలు ఎనలేనివన్నారు. దేశాయి పేటకు చెందిన కరుణ-కొమురయ్య దంపతులకు ఐదో సంతానం కరుణాకర్. 1996 లో బీఏ సోషి యాలజీలో డిగ్రీని సీకేఎం కళాశాలలో పూర్తి చేశాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితులతో పెయింటర్ వత్తిని ఎంచుకుని కూలీ చేసి కుటుంబాన్ని పోషించు కునే వారు. పెయింటర్ వత్తిలో దినసరి కూలీగా ఉం టూనే అంచెలంచెలుగా కాంట్రాక్టర్ స్థాయికి ఎదిగి తాను బతుకుతూ 10 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఒక భవనానికి సుందరీకరణ పనులు చేస్తూ ప్రమాదవ శాత్తూ ముగ్గురు మతి చెందిన సంఘటన కలిచి వేసింది. అప్పటి నుండి కరుణాకర్‌కు కార్మి కులకు ఏ విధంగానైనా సాయం చేయాలనే ఆలోచన ఏర్పడింది. అప్పుడు రిజిస్టర్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది మల్లారెడ్డి సహాయ సహకారాలు, అదేవిధంగా కాంట్రాక్టర్ దయాకర్ ఆర్థిక సహకారంతో 44 మంది కార్మికులకు లేబర్ కార్డులు సంబంధిత అధికారుల నుండి అందజేశారు. కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం తమ సేవలు అందిస్తున్నారు. అదే విధం గా యాచకులకు దుప్పట్ల పంపిణీతో పాటు అనే కసార్లు రక్తదానం, పేదలకు పండ్లు, మజ్జిగ పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం మొక్క లు నాటి అప్పటి నగర కమిషనర్ నీతూ ప్రసాద్, అప్పటి ఉమ్మ డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయు డుతో శభాష్ అనిపించుకున్నారు. కార్మికులకు మరింత సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో ప్రగతి బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ సొసైటీని ఏర్పా టు చేసి అనేక మంది కార్మికులకు అండగా ఉంటున్నారు.