Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హనుమకొండలో ఏర్పాటుపై బార్ అసోసియేషన్ అభ్యంతరం
నవతెలంగాణ-నర్సంపేట
వరంగల్ జిల్లా పరధిలోనే జిల్లా కోర్టును ఏర్పాటు చేయాలని నర్సంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొమ్ము రమేష్ యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గురువారం కోర్టు ఆవరణంలో నిర్వహించిన బార్ అసోసియేషన్ అత్యవసర సమావేశంలో రమేష్ మాట్లాడారు.రాష్ట్ర ప్రభు త్వం ప్రజలకు సత్వర న్యాయం అందించాలనే ఉద్ధేశంతో రాష్ట్రంలోని 33 జిల్లాలలో కోర్టులను ఏర్పాటు చేసిందన్నారు. వరంగల్ జిల్లా కోర్టును హనుమకొండ కొనసాగించాలని గెజిట్ విడుదల చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. దీనివల్ల ప్రజలకు తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లాలోని 13 మండలాల పరిధిలో ఎక్కడైనా అందరికి అందుబాట్లో ఉండే ప్రదేశంలో జిల్లా కోర్టును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.ఇతర జిల్లాలకు భిన్నంగా విడుదల చేసిన జిల్లా కోర్టు గెజిట్‌ను ప్రజలు, రాజకీయ పార్టీలు, ప్రజాస్వామికవాదులు వ్యతిరేకిం చాలని కోరారు. జిల్లా కోర్టు గెజిట్‌ను వెంటనే ఉపసం హరించుకోవాలని లేనిపక్ష్యంలో బార్ అసోసియేషన్ ఆధ్వ ర్యంలో దశల వారిగా పోరాటాలు చేయాల్సి వస్తుందని తెలి పారు. సమావేశంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు పుట్టపాక రవి, ప్రధాన కార్యదర్శి షేక్ రెహముద్దీన్, సీనియర్ న్యాయవాదులు తండా సారంగపాణి, గూళ్ల అశోక్ కుమార్, కొడిదెల సంజరు కుమార్, రాళ్లబండి లక్ష్మీనారాయణ, దొం తి సాంబయ్య, మోటూరి రవి, సిలువేరు కిరణ్‌కుమార్, జన్ను మహేందర్, అంబటి రాజ్‌కుమార్, ఈసీ మెంబర్ నాగుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.