Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీడీవో సంతోష్ కుమార్
నవతెలంగాణ-పర్వతగిరి
పల్లె ప్రగతి పనుల్లో అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని ఎంపీడీవో చక్రాల సంతోష్ కుమార్ అన్నారు. మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం పంచాయతీ కార్యదర్శులకు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లోని డంపింగ్ యార్డ్‌లో తడి చెత్త-పొడి చెత్త వేరు చేసి తడి చెత్తతో వర్మి కంపోస్ట్ తయారు చేయాలి. పొడి చెత్తను, ప్లాస్టిక్ వ్యర్థాలను ప్లాస్టిక్ కలెక్షన్ సెంటర్‌కు పంపించాలని సూచించారు. చెత్త నుండి సంపద సష్టించాలని ఎంపీవో పాక శ్రీనివాస్ అన్నారు. అన్ని వైకుంఠధామాల్లో నీటి సదుపాయం, విద్యుత్ సదుపాయం, మరుగుదొడ్ల సదుపాయం ఉండేలా చర్యలు తీసుకోవాలని, వచ్చే హరితహారం సీజన్‌కు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఉపాధి హామీ పనులకు కూలీలు ఎక్కువ సంఖ్యలో వచ్చేలా చూడాలని ఏపీవో సుశీల్ కుమార్ అన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామీ సిబ్బంది పాల్గొన్నారు.