Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రుణాలు ఇస్తామని మోసం చేసిన
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి : రుణాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న అంతర ్రాష్ట్ర సైబర్ ముఠాను ఐనవోలు పోలీసులు అరెస్ట్ చేశారు పోలీసులు ఉత్తర్‌ప్రదేశ్‌లోని అజంఘడ్‌కు చెందిన మనోజ్ జైస్వాల్ అజంఘడ్, జ్ఞానేంద్ర యాదవ్, బీహార్ రాష్ట్రం వార్సాలిగంజ్కు చెందిన రాజ్‌కుమార్ అనే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వారి నుండి రూ.1.07 లక్షలను, నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్ట్‌కు సంబంధించి వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి వివరాలను వెల్లడిస్తూ పెద్ద మొత్తంలో ఆన్లైన్ ద్వారా బ్యాంకు రుణాలు ఇప్పిస్తామని ఇండియా బుల్స్ మేనేజర్ పేరుతో రూ.1.36 లక్షలను సైబర్ నేర గాళ్ల చేతుల్లో మోసానికి గురైన బొంత రవీందర్ ఫిర్యాదు మేరకు ఐనవోలు పోలీసులు కేసు నమోదు చేశారు. వరంగల్ పోలీసు కమిషనర్ ఆదేశాల మేరకు ఈస్ట్ జోన్ డిసిపి వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో నేరస్తులను పట్టుకు నేందుకుగాను ఐనవోలు ఎస్సై భరత్‌తోపాటు ఇతర పోలీ సు సిబ్బందితో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం బీహార్, ఉత్తర్‌ప్రదేశ్ ప్రాంతాలకు వెళ్లింది. నేరానికి పాల్పడిన నేరస్తులను గుర్తించి వారిని అదుపులోకి తీసుకొని వారి నుండి సెల్ఫోన్లతోపాటు సిమ్‌కార్డులు, డబ్బును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. దర్యాప్తు అనంతరం పోలీసు బృందం నిందితులను స్థానిక ఆజంఘడ్ కోర్టులో హాజరుపరిచి తిరిగి వరంగల్ పోలీసు కమిషనరేట్‌కు తీసుకురావడంతో నిందితులు సైబర్ నేరాలకు ప్పాడేం దుకుగాను వినియోగించే సెల్‌నెంబర్లు, బ్యాంకు ఖాతాలు, యుపిఐ ఖాతాల వివరాలపై పర్వతగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ విశ్వేశ్వర్ విచారణ అనంతరం నిందితులను వరంగల్ కోర్టులో హజరుపర్చడం జరిగింది. నిందితులను పట్టు కోవడం ప్రతిభ కనపరిచిన ఈస్ట్‌జోన్ డిసిపి వెంకటలక్ష్మి, మామునూరు ఎసిపి నరేష్కుమార్, పర్వతగిరి సిఐ, ఐటికోర్ ఇన్స్పెక్టర్లు విశ్వేశ్వర్ నరేష్కుమార్, ఐనవోలు ఎస్సై భరత్, ఏఏఓ సల్మాన్‌షా, ఎఎస్ శర్మ, కానిస్టేబుళ్లు శ్రీనివాస్, అన్వర్, రాకేష్‌తోపాటు ఇతర పోలీసు సిబ్బందిని పోలీసు కమిషనర్ అభినందించారు.