Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాటారం
భారతరత్న, భారత తొలిప్రధాని జవహర్లాల్ నెహ్రు నవ భారత నిర్మాత అని మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం నెహ్రూ వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ నెహ్రు స్వాతంత్య్ర సమరయోధుడిగా తొమ్మిదేళ్లపాటు ఆలీపూర్, లక్నో, డెహ్రాడూన్, అల్లోరా జైలు గోడల మధ్య దుర్భర జీవితాన్ని గడిపారని అన్నారు. దేశంలో సాంకేతిక ప్రగతికి నెహ్రూ బలమైన పునాదులు వేశారని తెలిపారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వేమునురి ప్రభాకర్‌రెడ్డి, ఎంపీపీ పంతకానీ సమ్మయ్య, సర్పంచ్ నరేష్, యూత్ అధ్యక్షుడు చీమల సందీప్, కడారి విక్రమ్, సీనియర్ నాయకులు చీర్ల తిరుపతి, రామ్మోహన్, తదితరులు పాల్గొన్నారు.
భూపాలపల్లి : మాజీ ప్రధాని జవహర్లాల్ వర్ధంతిని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు ఇస్లావత్ దేవన్ అధ్వర్యంలో సీనియర్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ, భూపాలపల్లి రైతు రచ్చబండ ఇన్చార్జి సుదర్శన్ ప్రసాద్ తివారి పాల్గొని నెహ్రు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లడుతూ ఆయన మరణించిన 58 సంవత్సరాల నుం డి నెహ్రూ ఆలోచనలు, రాజకీయాలు, మన దేశం పట్ల ఉన్న దార్శనికత ఎప్పటిలాగే ఉన్నారు అని కొని యాడారు. కార్యక్రమంలో చల్లూరి మధు, సుంకరి రామ చంద్రయ్య, ఎన్ఎస్యూఐ జిల్లా అద్యక్షులు బట్టు కర్ణా కర్, రాజన్న, పొనకంటి శ్రీనివాస్, బౌతు రాజేష్ ,కం చర్ల సదానందం, అయిలవేని రమేష్, కౌతోజు రమణాచారి ,రాజిరెడ్డి, షేక్ ఇజాజ్, పైతరి రాజు, కంకాల మధు, అర్జున్, పోల్సాని కరుణాకర్ రావు, బౌతు సతీష్, తదితరులు పాల్గొన్నారు.