Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేయూ ఫార్మసి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గాదె సమ్మయ్య
నవతెలంగాణ-హసన్పర్తి
కోనసీమకు ముందు అంబేద్కర్ పేరునే కొనసాగించాలని కేయూ ఫార్మసి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గాదె సమ్మయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్.అంబేద్కర్ పేరును ఒక జిల్లాకి పెడితే ఇంత రాద్ధాంతం చేయడం ఎంతవరకు న్యాయమని అన్నారు. వివిధ రాజకీయ పార్టీలు దళితులను ఓ టు బ్యాంకుగా వినియోగించుకుంటున్నారే తప్ప వారిపై ఎలాం టి ప్రేమ, చిత్తశుద్ధి లేదన్నారు. అంబేద్కర్ జయంతి వర్ధం తిలకు వచ్చి కపటంగా దండలు వేసి వెళ్తున్నారే తప్ప దళితుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదని విమర్శించారు. అంబేద్కర్ను కులానికి, మతానికి పరిమితం చేసినంత కాలం దేశంలో సామాజిక న్యాయం దొరకదన్నారు. అంబేద్కర్ అందరివాడు అని ఏ కులా నికి మతానికి సంబంధించిన వ్యక్తి కాదని, ఆయన అన్ని కులాలకు మతాలకు అను కూలంగా రాజ్యాంగం రాశా డని అన్నారు. దళిత బహుజ నులు కుల మత పరమైన అంశాలకు ప్రాముఖ్యత ఇవ్వకుండా, శాస్త్రీయపరంగా ఆలోచిం చాలని ఆయన ప్రసాదించిన ఓటు హక్కును వినియోగిం చుకొని రాజ్యాధికారంను నిర్మించుకున్న రోజు ఇలాంటి దాడులు జరగకుండా ఆపవచ్చని అన్నారు.