Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య
నవతెలంగాణ-లింగాలఘణపురం
పేద కుటుంబాలను ఆదుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలను అమలు చేస్తోందని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య తెలిపారు. మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 22 మంది లబ్దిదారులకు ఎమ్మెల్యే రాజయ్య శుక్రవారం కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి రాజయ్య ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సుదీర్ఘ పోరాటాల ఫలితంగా స్వరాష్ట్రాన్ని సాధించుకున్న క్రమంలో పేదల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా సీఎం కేసీఆర్ అనేక పథకాలను రూపొందించి అమలు చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ గుడి వంశీధర్‌రెడ్డి, ప్రజాప్రతినిధి గణపతి, తహసీల్దార్ అంజయ్య, మండల యూత్ అధ్యక్షుడు శ్రీవారి, తదితరులు పాల్గొన్నారు.