Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
వరంగల్ జిల్లా రామన్నపేటలో, పర్వతగిరి మండలం వడ్లకొండలో కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ ఏసీపీ మాట్లాడుతూ ఎవరైనా చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు గమనిస్తే ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. ఏసిపి పర్యవేక్షణలో మట్టెవాడ పోలీస్టేషన్ పరిధిలోలోని రామన్నపేటలో మిల్స్ కాలనీ, ఇంతేజార్ గంజ్, మట్టెవాడ పోలీసులు సంయుక్తంగా శుక్రవారం రాత్రి కర్డెన్స్ సెర్చ్ నిర్వహించరు. 140 గహాలలో తనిఖీలు నిర్వహించగా సరైన ధ్రువపత్రాలు లేని 12 ద్విచక్ర వాహనాలు, 7000 విలువగల మద్యాన్ని స్వాధీనం చేసు కున్నారు. 9500 రూపాయల ఫైన్ ల అమౌంట్ నో రికవరీ చేశారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి వరంగల్ ఏసీపీ మాట్లాడుతూ నేర నియంత్రణ కోసం ప్రజల భాగ స్వామ్యం అవసరం అని యువత మాదక ద్రవ్యాలు అయినా డ్రగ్స్, గంజాయి, మట్కా, మద్యం వైపు వెళ్లకుండా చూ డాలని అన్నారు. ప్రజలు తమ నివాస ప్రాంతాలలో అను మానితులు ఎవరైనా ఉంటే సమాచారాన్ని అందించాలని ప్రతి కాలనీలో సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరిగా చేసు కోవాలని అన్నారు. నేరాలకు సంబంధించిన వివరాలు తెలియ చేసిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని నేర నియంత్రణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని కోరారు. ఈ కార్డెన్ సెర్చ్ లో సిఐలు సిహెచ్ రమేష్, మల్లే ష్, శ్రీనివాస్, సబ్ ఇన్స్పెక్టర్లు కానిస్టేబుల్ లు పాల్గొన్నారు.
పర్వతగిరి : మామూనూర్ ఏసీపీ నరేష్ కుమార్ సర్ ఆధ్వర్యంలో శుక్రవారం మండల పరిధిలోని వడ్లకొండ గ్రామం లో ఈ రోజు ఉదయం 27 మంది పోలీస్ సిబ్బంది తో కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ కార్య క్రమం లో భాగంగా తనిఖీ లు చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ప్రజలకు సామాజిక వ్యసనాలు అయిన గూట్కా,గంజాయి, గుడుంబా, పేకాట మరియు బాల్య వివాహల పట్ల అవగాహన కల్పించారు.నకిలీ విత్తనాల పై, కాలం చెల్లిన విత్తనాలపై ప్రజలకి అవగాహన కల్పించారు.ఈ తనిఖీ లలో రూ.లు. 2000 విలువ చేసే అక్రమంగా నిలువ చేసిన మద్యం,1200 విలువ చేసే గూట్కా పాకెట్స్, సరి అయినా పత్రాలు లేని 14 ద్విచక్ర వాహనాలని,4 ఆటోలు, 2 టాటా ఏస్ లని స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో పర్వ తగిరి సీఐ విశ్వశ్వర్, మామునూర్ సీఐ రమేష్,పర్వత గిరి ఎస్సై కిట్టు కిషోర్, ఐనవోలు ఎస్. ఐ భరత్, సంగెం ఎస్. ఐ కిరణ్మయి, మామూనూర్ ఎస్.ఐ రాకేష్ రెడ్డి, కష్ణవేణి, గీసుగొండ ఎస్. ఐ వెంకన్న, ఇతర పోలీస్ సిబ్బంది, వడ్ల కొండ సర్పంచ్ రాజుయాదవ్ తదితరులు పాల్గొన్నారు.