Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
వరంగల్ చౌరస్తాలో అగ్ని ప్రమాదం చోటు చేసు కుంది. నగరం నడిబొడ్డులో గహ సముదాయాలకు ఆనుకొని ఉన్న ఒక ఫ్యామిలీ రెస్టారెంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో అప్రమ త్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ చౌర స్తాలోని మను రెస్టారెంట్లో శుక్రవారం తెల్లవారుజామున రెండు, మూడో అంతస్తుల్లో దట్టంగా పొగలు అలుము కున్నాయి. కొద్ది సమయంలోనే ఒక్కసారిగా భవనం అం తస్తుల నుండి అగ్నికీలలు ఉవ్వెత్తున ఎగిసిపడి బయటకి వచ్చాయి. గమనించిన పాదచారులు, స్థానికులు అప్ర మత్తమై 100 నంబర్ ద్వారా పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి తెలుపగా స్పందించిన పోలీసులు, అగ్నిమాపక యంత్రాంగం అగ్నిమాపక శకటం తో వచ్చి మంటలు ఆర్పే శారు. రెస్టారెంట్ పక్కనే ఉన్న శివ పేపర్ మార్ట్‌కి మంటలు సోకి ఉంటే ప్రమాదం మరోలా ఉండేదన్నారు. కరెంటు షార్ట్ సర్క్యూట్ ద్వారా ప్రమా దం సంభవించి ఉంటుందని చెప్పారు. రెస్టారెం ట్‌కు నిప్పు అంటుకోవడంతో సుమా రు రూ.కోటి విలువ చేసే వస్తుసామగ్రి కాలి బూడిదైనట్లు అంచనా వేస్తున్నారు.
దగ్ధమైన రెస్టారెంట్‌ను సందర్శించిన ఎమ్మెల్యే..
శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తూ షార్ట్ సర్క్యూట్ తో మను రెస్టారెంట్, శివ పేపర్మార్ట్ దగ్ధమైన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ప్రమాదం జరిగిన స్థలానికి వచ్చి పరిశీలించారు. అనంతరం ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. యాజమానులకు దైర్యం చెప్పి బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.