Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-కాటారం
మండలం కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో రమాబాయి అంబేద్కర్ 87వ వర్థంతిని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాను రమాబాయి అంబేడ్కర్ జిల్లా పేరు పెట్టాలని ములుగును సమ్మక్క సారక్క జిల్లాగా పేరుపెట్టాలని డిమాండ్ చేశారు. కోనసీమలో విధ్వంస ఘటనల వెనుక ఉన్న అరాచక శక్తులను కఠినంగా శిక్షించాలన్నారు. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ ఇళ్ల మీద దాడి హేయమైన చర్యగా అబివర్ణించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబే ద్కర్ పేరును కోనసీమ జిల్లాకు పెట్టడాన్ని సహించలేని అరాచక శక్తులు విధ్వంసాలు సష్టించడం దారుణ మన్నారు. కార్యక్రమంలో తుడుందెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షులు కుడిమెత సమ్మయ్యదొర, తెలంగాణ మాల భేరి రాష్ట్ర కన్వీనర్ పీక కిరణ్, తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు కుమార్, బోడ రాజు, యూత్ నాయకులు నరేష్. కొమురంభీం యూత్ నాయకులు రవితేజ, బోడ శ్రవణ్ మల్లేష్, తుడుం దెబ్బ జిల్లా ఉపాధ్యక్షుడు సుంకరి మల్లేష్, అక్కల బాపు పాల్గొన్నారు.
హనుమకొండ చౌరస్తా : కేయూలో ప్రధాన గ్రంథాలయం ఎదుట బియస్ఎఫ్, పిడియస్‌యూ ఆధ్వర్యంలో రమాబాయి 87వ వర్ధంతిని నిర్వహిం చారు. ఈ సందర్భంగా బియస్.ఎఫ్ కె.యూ ఇంచార్జి, హన్మకొండ జిల్లా అధ్యక్షులు బొట్ల మనోహర్, పి.డి. యస్.యూ కె.యూ కార్యదర్శి కోటేశ్వర్ మాట్లాడుతూ భర్త అంబేద్కర్ ఉన్నత చదువులు చదువుకోసం ఆమె కష్టం చేసి డబ్బును అంబేడ్కర్ చదు వులకు ఖర్చు పెట్టిందన్నారు. అంబేద్కర్‌కు అన్నిరకాలుగా సహా యసహకారాలు అందించి బడుగు బలహీన వర్గాలకు భారత రాజ్యాంగం అందించి దేశ ప్రజలను బానిసత్వం నుండి విముక్తి కల్పించారు. కార్యక్రమంలో రాజు, నాగార్జున, సాయి,గణేష్, మనోజ్,ప్రదీప్, అశోక్,క్రాంతి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.