Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్
నవతెలంగాణ-నెల్లికుదురు
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం 'మన ఊరు-మన బడి' కార్యక్రమంలో భాగంగా పలు పనులు చేపడుతోందని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ తెలిపారు. 'మన ఊరు-మన బడి' కార్యక్రమంలో భాగంగా మండలంలోని నైనాల, ఆలేరు గ్రామాల్లో ఎస్ఎంసీ చైర్మెన్ ఆవుల సాయిమల్లుతో కలిసి పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం 'మన ఊరు-మన బడి' కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించనున్నట్టు తెలిపారు. రానున్న విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన అందించనున్నట్టు వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి, జెడ్పీటీసీఈ మేకపోతుల శ్రీనివాస్‌రెడ్డి, మండల అధ్యక్షుడు పరిపాటి వెంకట్‌రెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వ్యాసం రమేష్, సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ వెంకటేశ్వర్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు లింగారెడ్డి, రాజేంద్ర, ఏఈ అన్సారీ అలీ, తదితరులు పాల్గొన్నారు.