Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐఎన్టీయూసీ భూపాలపల్లి బ్రాంచ్ ఉపాధ్యక్షులు జోగ బుచ్చయ్య
నవతెలంగాణ-కోల్‌బెల్ట్
కార్మిక సమస్యలు పరిష్కరించడం కేవలం సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్‌కు మాత్రమేనని గ్రహించి ఐఎన్టీయూసీలో చేరే కార్మికులను కొంతమంది కార్మిక సంఘ నాయకులు బెదిరింపులకు దిగుతున్నారని ఇది సరైన పద్ధతి కాదని ఆ సంఘం భూపాలపల్లి బ్రాంచ్ ఉపాధ్యక్షులు జోగ బుచ్చయ్య హెచ్చరించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ వాము భూపాలపల్లి ఏరియాలోని కేటీకే-6 పిట్ కమిటీని అన్ని విభాగాలలో కలిపి పూర్తిస్థాయిలో 36 మందితో ఐఎన్టియుసి జనరల్ సెక్రటరీ బి.జనక్ ప్రసాద్ ఆదేశాల మేరకు వేసినట్లు తెలిపారు. పిట్ కమిటీ సభ్యులు ప్రతిశాఖలోని సమస్యను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని, అలాగే బ్రాంచ్ కమిటీ దష్టికి తేవాలన్నారు. గెలిచిన కార్మిక సంఘాలు కార్మిక సమస్యలు పట్టించుకోకపోగా, కార్మికులను మానసిక ఒత్తిళ్లకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అటువంటి నాయకులకు కార్మికులు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. రానున్న ట్రేడ్ యూనియన్ ఎన్నికల లో ఐ ఎన్ టి యు సి విజయ ఢంకా మోగించడం ఖాయమన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయమని, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించడమే కాకుండా, పర్మినెంట్ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కాంట్రాక్ట్ కార్మికులకు భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు అండెం రఘుపతి రెడ్డి డిప్యూటీ జనరల్ సెక్రటరి, సిరంగి రాజయ్య బ్రాంచ్ సెక్రెటరి, చిరుత లక్ష్మి నారాయణ ఫిట్ సెక్రటరి, కె .వేణుగోపాల్, ఎస్. జనార్దన్, బి. శ్రీనివాస్, డి. శ్రీనివాస్ లు పాల్గొన్నారు.