Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కో-కన్వీనర్ మిశ్రిన్ సుల్తాన్
నవతెలంగాణ-భూపాలపల్లి
గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న సిబ్బందిపై చర్యలు తీసుకొని కేసు నమోదు చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కో కన్వీనర్ మిశ్రిన్ సుల్తాన్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. కార్యక్రమానికి జిఎస్సిసి రాష్ట్ర గర్ల్స్ కో కన్వీనర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ బాలికల ఆశ్రమ పాఠశాలలో పని చేస్తున్నటు వంటి వంట మనిషి, వాచ్మెన్ కొద్ది రోజుల నుండి విద్యార్థులపై అసభ్యంగా వ్యవహరిస్తూ విద్యార్థుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడడం విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిద్దరిపై అలౌకిక వేధింపులకు కేసు నమోదు చేసి జైలుకు పంపించాలని వారు డిమాండ్ చేశారు. ఆశ్రమ పాఠశాలలో మరుగుదొడ్లు, స్నానపు గదులకు సరిగా లేకపోవడం ఆశ్రమ పాఠశాల అయినప్పటికీ వాటి చుట్టూ ప్రహరీ లేకపోవడంతో విద్యార్థులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. వెంటనే ప్రహరీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు
మహిళ ప్రిన్సిపాల్‌ను నియమించాలి
జిల్లా కేంద్రంలోని బాలికల పాఠశాలకు మహిళా ప్రిన్సిపాల్ నియమించాలని జిల్లా కార్యదర్శి దామెర కిరణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థుల పై జరుగుతున్నటు వంటి వేధింపులు ప్రిన్సిపల్ నిర్లక్ష్య వైఖరి వల్లనే జరిగింద న్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న వంటి వేధింపులకు కారకులైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల ఎస్ఎఫ్ఐ విద్యార్థులు ఆధ్వర్యంలో సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బొడ్డు స్మరన్, జిల్లా సహాయ కార్యదర్శి సంపత్ రెడ్డి, జిల్లా నాయకులు కిషోర్, రాజు పాల్గొన్నారు.