Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాటారం
ఏపీలోని కోనసీమకు బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టడంతో జరిగిన విధ్వంసాలను నిరసిస్తూ శుక్రవారం కాటారం అంబేద్కర్ చౌరస్తాలో మంథని నియోజకవర్గ టిఆర్ఎస్ ఇన్చార్జి, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ నిరసన దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోనసీమ సంఘటన ప్రజాస్వామ్య స్పూర్తికే అవమానమన్నారు. 76 ఏండ్ల తర్వాత ఈ దుస్థితి నెలకొన్నందుకు ప్రజాస్వామ్యవాదులంతా తలదించుకునే పరిస్థితులు ఏర్పడటం బాధాకరమన్నారు. అంబేద్కర్ తమ వర్గానికి చెందిన వాడని ఒక్క ఎస్సీలు అన్నంత మాత్రన వాళ్ల నాయకుడు అవుతాడా అని ఆయన ప్రశ్నించారు. ప్రపంచ దేశాల్లో అంబేద్కర్ మా దేశం వాడైతే బాగుండని ఆలోచిస్తున్న తరుణంలో దేశానికి గర్వకారణమని చెప్పుకోకపోవడానికి కారణం ఎవరో మేధావులు ఆలోచించుకోవాలన్నారు. అంబేద్కర్ ఇంకా ఎస్సీలకు మాత్రమే చెందిన వ్యక్తిగా చిత్రీకరిస్తున్న దుర్మార్గపు ఆలోచనను నియోజకవర్గ ప్రజలకు తెలియజేసే ప్రయత్నం కొనసాగిస్తామని, దురదష్టమైన సంఘటనను దేశ ప్రజలు ఖండించాలన్నారు. అనంతరం కాటారం అంబేద్కర్ చౌరస్తాలోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ చల్ల నారాయణ రెడ్డి, మండల అధ్యక్షుడు తోట జనార్ధన్, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జక్కు రాకేష్, యూత్ మండల అధ్యక్షులు రామిళ్ళ కిరణ్, ఉప సర్పంచ్ శ్రీనివాస్, సడవలి, రాజు, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.