Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బల్దియా మేయర్ గుండు సుధారాణి
నవతెలంగాణ-వరంగల్
పిల్లలను క్రీడల్లో నిష్ణాతులుగా తీర్చిదిద్దడానికి శిక్షణ ను అందజేస్తున్నట్లు బల్దియా మేయర్ గుండు సుధారాణి పేర్కొన్నారు. ప్రధాన కార్యాలయం ఇండోర్ స్టేడియం లో బల్దియా ఆద్వర్యం లో శుక్రవారం కొనసాగుతున్న ఉచిత క్రీడల శిక్షణ శిబిరాన్ని మేయర్ ఆకస్మికంగా సందర్శించి పిల్లలకు కోచ్ లు నేర్పుతున్న శిక్షణను పరిశీలించారు. అనంతరం క్రీడల్లో పాల్గొంటున్న బాల,బాలికలకు అల్పా హా రమైన అరటి పండ్లు, కోడిగుడ్లు, బిస్కట్ ప్యాకెట్స్, మజ్జి గలను అందజేశారు.ఈ సందర్భంగా మేయర్ మా ట్లాడుతూ మే 9 నుండి 31 వ తేదీ వరకు ఆరు క్రీడాం శాలైన జూడో, బాడ్మింటన్, యోగ, చెస్, క్యారమ్స్, టేబుల్ టెన్నిస్ లలో 153 మంది బాల, బాలికలకు ఉదయం, సాయంత్రం రెండు సెషన్స్ లో ఉచితం గా శిక్షణతో పాటు అరటిపండ్లు, కోడిగుడ్లు,బిస్కట్ ప్యాకెట్స్, మజ్జిగల్ లను అందజేయడం జరుగుతున్నదని, ఇట్టి శిక్షణ పిల్లల్లో క్రీడల పట్ల ఆసక్తిని పెంచి, భవిషత్తులో మరింత ఉన్నతంగా రాణించడానికి దోహదం చేస్తాయన్నారు. శిక్షణ శిబిరం చివరి రోజు శిక్షణ పొందిన పిల్లలకు ఆయా క్రీడాం శాల్లో పోటీలు నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు ప్రదానం చేస్తామని, శిక్షణ పొందిన పిల్లలం దరికీ అప్ప్రెసిషన్ సర్టిఫికెట్లు కూడా ప్రదానం చేస్తామని తెలిపారు. స్పోర్ట్స్ డైరెక్టర్ కిషోర్, కోచ్లు కిరణ్, శ్రీధర్, రజిత, ఖన్నా, సురేష్, రవి తదితరులు పాల్గొన్నారు.