Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి
నవతెలంగాణ-హసన్‌పర్తి
రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే వరంగల్ రైతు డిక్లరేషన్ అని హన్మకొండ, వరంగల్ జిల్లా కాంగ్రేస్ కమిటీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. మం డలంలోని జయగిరి, మడిపల్లి, అనంతసాగర్, ఎల్లాపూర్ గ్రామాల్లో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పోరెడ్డి మహేం దర్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతు రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, వర్దన్నపేట నియోజకవర్గ ఇంచార్జి నమిండ్ల శ్రీనివాస్ ఆయా గ్రామాల్లో పర్యటించి దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టత కోసం, రైతు, నిరుపేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ కార్యక్రమాలను గ్రామ ప్రజలకు వివరించారు. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించిన కాంగ్రేస్ అధినేత్రి చేసిన త్యాగం గురించి ప్రజలకు అవగా హన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు చిర్ర సుమ లత విజరుకుమార్, జోర్క పూల, జిల్లా కాంగ్రేస్ నాయకులు పింగిళి వెంకటనరసింహారెడ్డి, హన్మకొండ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తంగళ్లపల్లి తిరుపతి, మాజీ ఉప సర్పంచ్ బండ చంటిరెడ్డి, మండల కిసాన్ అధ్యక్షుడు వట్టే శ్రీని వాస్‌రెడ్డి, మండలఎస్సీ సెల్ అధ్యక్షుడు రామంచ దయాకర్, మండల యూత్ అధ్యక్షుడు చరణ్‌తేజ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.