Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
ఉత్తర తెలంగాణకు పెద్దదిక్కుగా పేదలకు వర ప్రదాయినిగా పేరుపొందిన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో సమస్యలు విలయ తాండవం చేస్తున్నాయని సిపిఐ(ఎం) వరంగల్ కమిటీ సభ్యులు ఆరోపించారు. శుక్రవారం ఎంజీఎం ఆస్పత్రిలో సిపిఎం వరంగల్ కమిటీ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను తెలుసుకున్న వారు సమస్యలను పరిష్కరించి పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని కోరుతూ సూపరిండెంట్ చంద్రశేఖర్‌కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంజీఎం హాస్పి టల ్లోని మహిళలు, పురుషుల వార్డులలో పేషెంట్లు, పరిసరాలలో పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలో పలు సమస్యలు ఉన్నట్లుగా తెలుస్తోందన్నారు. రోగులకు కావలసిన పరీక్షల కోసం బయటికి పంపించి వేస్తున్నారని, సి బి పి ట్యూబులు సరఫరా కూడా లేదని, సరిపడా భోజనాలు పెట్టడం లేదని మంగళవారాల్లో పౌష్టికాహారంతో కూడిన మాంసం భోజనం అందించడం లేదని, పరిసరాలలో బ్లీచింగ్ తో పాటు వార్డులలో ఫ్యాన్లు సక్రమంగా తిరగడం లేదని అన్నారు. ఎంజీఎం సూపరిం టెండెంట్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మెరుగైన సౌకర్యాలు కల్పించి రోగులకు సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం వరం గల్ కార్యవర్గ సభ్యులు సింగారపు బాబు, కమిటీ సభ్యులు ఆరూరి కుమార్, రంగరాజు విజయ, విజరు కుమార్, సాయి కుమార్, సోనీ, రాజేశ్వరి, ఇంద్ర, రాజమ్మ, తదితరులు పాల్గొన్నారు.